కలుపు  నివారణ :

వర్షాకాలంలో రెండుసార్లు తోటంతా దున్నటం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేలగుల్లబారి వాననిరు ఇంకుతుంది.

వర్షాకాలంలో తొలకరి వర్షం తరువాత అట్ర్రటాప్ ఎకరాకు 800 గ్రా.240 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తర్వాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు నివారణకు గ్లైసిల్ లేదా రౌండప్ కలుపు మందును లీటరు నీటికి 8 మి.లీ. మందును కలిపి దానితో పాటు 20 గ్రా. అమ్మోనియం సల్ఫేట్ గాని, 10 గ్రా. యూరియా గాని కలిపి 20-25 రోజులు కలుపుపై పిచికారి చేయాలి.

ఈ మందు వాడేటప్పుడు చిన్న వయస్సు పండ్ల మొక్కల మీద పడకుండా జాగ్రత్త వహించాలి.

దానిమ్మ తోపాటు చీని, నిమ్మ, జామ, సపోట, రేగు, సీతాఫలం తోటల్లో కూడా ఇదే విధంగా కలుపు నివారణకు చేసుకోవచ్చు.